MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni IPL Retirement: ఐపీఎల్లో దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలకడంపై క్రికెట్ ప్రపంచం స్పందిస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ధోనీని తమ జట్టు మెంటర్‌గా నియమిస్తున్నట్లు సీఎస్కే ప్రకటించింది. దీంతో ఐపీఎల్లో ధోనీ 19 ఏళ్ల ప్రయాణానికి తెరపడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సహా పలువురు ప్రముఖులు ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ సందేశాలు పంచుకున్నారు.
మాజీ భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ఎంఎస్ ధోనీకి అభినందనలు తెలిపాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే పోటీని అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా పిలుస్తుంటారు. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో రోహిత్, ధోనీ ప్రత్యర్థి కెప్టెన్లుగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘అద్భుతమైన ఐపీఎల్ కెరీర్‌కు అభినందనలు ధోనీ భాయ్. ఇన్నేళ్లుగా నీతో కలిసి మైదానాన్ని పంచుకోవడం, ఎన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకోవడం ఎంతో సరదాగా అనిపించింది. నీపై ఎప్పటికీ గౌరవం ఉంటుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
Also Read
- MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
- CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ధోనీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్, తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి ధోనీనే అని పేర్కొన్నాడు. ‘నాకు అత్యంత ఇష్టమైన క్రికెటర్, నేను ఎక్కువగా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి నువ్వే. ఇన్నేళ్లుగా అందించిన మధుర జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ఇకపై నీ జీవితంలో ముందున్న ప్రయాణానికి శుభాకాంక్షలు’ అని బుమ్రా తన పోస్ట్‌లో రాశాడు. ధోనీ కెప్టెన్సీలోనే బుమ్రా భారత జట్టులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం ధోనీ సేవలను గుర్తుచేసుకున్నారు. ఐపీఎల్ ఎదుగుదల, విజయాల్లో ధోనీ కీలక భాగస్వామిగా నిలిచాడని ప్రశంసించారు. ‘ఐపీఎల్ అభివృద్ధి, విజయాల్లో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. అతడి నాయకత్వం, విజయాలు ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చాయి. అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలను అందించాయి. భవిష్యత్తులో ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పంచుకున్నాడు. సీఎస్కే దిగ్గజంతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ లీగ్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ధోనీ ఒకరిగా నిలిచాడు. తన కెప్టెన్సీలో సీఎస్కేకు 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐదు టైటిళ్లు అందించాడు. చెన్నై జట్టు రెండేళ్ల నిషేధానికి గురైన సమయంలో 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడాడు. 2018లో సీఎస్కే తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చిన వెంటనే జట్టుకు టైటిల్ అందించి చిరస్మరణీయంగా నిలిచాడు. 2024 సీజన్‌కు ముందు ధోనీ సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. అయినప్పటికీ ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ వికెట్ కీపింగ్‌తో పాటు కీలక సమయాల్లో తన బ్యాటింగ్‌తోనూ జట్టుకు అండగా నిలిచాడు. 2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ధోనీకి చివరి ఐపీఎల్ మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత కాలి కండరాల గాయం కారణంగా 2026 సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆటగాడిగా తిరిగి బరిలోకి దిగబోనని స్పష్టం చేస్తూ మెంటర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. ధోనీ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేశాడు. 38.30 సగటు, 137.45 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడి ఖాతాలో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
- Tags
- CSK
- IPL 2027
- ms dhoni
- rohit sharma
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
-
Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
ట్రెండింగ్
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!