Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Funny Comments on Venky Kudumula: కొత్త నటుడు అనీష్ రెడ్డి హీరోగా, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను కింగ్ నాగార్జున సమర్పించగా.. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. భారీ బడ్జెట్‌తో, ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకీ కుడుముల గురించి చిరు చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెంకీ కుడుములలో మంచి కామెడీ సెన్స్ ఉందని, ఆయన సినిమాలు తనకు నచ్చుతాయని చిరంజీవి చెప్పారు. ‘వెంకీ కుడుముల నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. ఓ రకంగా నాకు చాలా బాధగా ఉంది. వెంకీలో కామెడీ సెన్స్ బాగుంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలు చూశాను. నేను ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు. కానీ ఈ దుర్మార్గుడిని మాత్రం అడిగాను. మంచి కథతో వస్తాను సర్ అని చెప్పాడు. అప్పటి నుంచి చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. ఆఖరికి నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లు అర్జునకు నిర్మాతగా మారాడు’ అని చిరంజీవి నవ్వులు పూయించారు.
Also Read
- Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
- IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
- RC17 Heroine: హీరోయిన్ రేసులో ఐదుగురు కుర్ర భామలు.. సుకుమార్ మనసులో ఎవరున్నారు?
- Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. 'కాక' సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
అంతటితో ఆగకుండా.. ‘పోనీ నాతో సినిమా నిర్మిస్తాడా అంటే.. యంగ్ స్టర్స్ కావాలట’ అంటూ వెంకీపై చిరు చమత్కరించారు. అనంతరం ‘నువ్వు కథ చెప్పడానికి వస్తావా? లేదంటే నా ఇంటి తలుపులు మూసేయనా?’ అని సరదాగా ప్రశ్నించారు. దీనికి వెంకీ స్పందిస్తూ.. ‘మీరు తలుపులు మూసేసినా.. నేను దూకి వస్తా సర్’ అంటూ బదులిచ్చారు. వెంకీ సమాధానంతో వేదిక మొత్తం నవ్వులతో మార్మోగింది. చిరంజీవి, వెంకీ కుడుముల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇట్లు అర్జున సక్సెస్ మీట్లో చిరు, వెంకీ మధ్య జరిగిన హాస్యభరిత సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
-
BJP Slams Rahul Gandhi: ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!
-
Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
-
Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
-
Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!