పైరసీ కింగ్ ‘ఐబొమ్మ’ (iBOMMA) రవి (ఇమంది రవి)కి సంబంధించిన ఐదు రోజుల పోలీసు కస్టడీ కాసేపట్లో ముగియనుంది. ఈ ఐదు రోజుల విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీ ముగియడంతో, పోలీసులు సాయంత్రం 5 గంటలకు రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కస్టడీ సమయంలో రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దాదాపు రూ. 20 కోట్ల లావాదేవీలపై బ్యాంకు అధికారుల సహకారంతో ట్రాన్సాక్షన్స్ వివరాలు తెప్పించుకుని రవిని ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ పోలీసులు రవికి సంబంధించిన 36 బ్యాంకు ఖాతాలు మరియు వాటి లావాదేవీలను గుర్తించారు. రవి, అతని స్నేహితుడు నిఖిల్ ఇద్దరూ కలిసి క్రిప్టో ద్వారా భారీగా డబ్బు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రవి 1Xbet యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్ యాప్‌ల ద్వారా కూడా భారీగా డబ్బు కూడబెట్టినట్లు నిర్ధారించారు.
Also Read :Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!
రవి వెబ్‌సైట్స్, డొమైన్ నెట్‌వర్క్, ఐపీ మాస్కింగ్ చేసిన ఎన్‌జిల సంస్థ విజయాలపై కూడా పోలీసులు ఆరా తీశారు. రవి మరియు అతని స్నేహితుడు నిఖిల్ ఇద్దరూ కలిసి ఈ టెక్నికల్ ఆపరేషన్స్‌లో పాలుపంచుకున్నట్లు గుర్తించారు. ఇందులో డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్, VPN/IP మాస్కింగ్ వంటి అంశాలు ఉన్నట్లు తేలింది. నిఖిల్‌కి భారీగా డబ్బులు బదిలీ అయినట్లు కూడా గుర్తించారు. అయితే, పోలీసుల ప్రశ్నకు రవి మాత్రం “నేను ఒక్కడినే అన్ని చేశాను, నా వెనుక ఎవరూ లేరు” అని చెప్పినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 5 కేసులు నమోదయ్యాయి. మిగతా కేసుల్లో విచారణ కోసం పోలీసులు ఇప్పటికే పిట్ వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపనున్న సైబర్ క్రైమ్ పోలీసులు, పిట్ వారెంట్ ద్వారా మరోసారి రవిని విచారణకు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఐబొమ్మ రవి కస్టడీ కేసులో రేపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.