తెలుగు సినిమా పరిశ్రమను ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పైరసీకి ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న ‘ఐబొమ్మ (iBomma)’ వెబ్‌సైట్ నిర్వాహకుడు **ఇమ్మడి రవి** అరెస్టు సంచలనంగా మారింది. కరేబియన్ దీవుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న రవి, భారత్‌లోని తన ఆస్తులను అమ్ముకోవడానికి వచ్చి హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా చిక్కాడు.
Also Read:Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు?
రవి విచారణలో కీలక అంశాలు
2022లో రవి తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అదే సంవత్సరం, సుమారు రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వం తీసుకున్నాడు. 2022 నుంచి అతను **కరేబియన్ దీవుల్లో** ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. తాజాగా, భారత్‌లో ఉన్న తన ఆస్తులను అమ్ముకోవడానికి మూడు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. హైదరాబాద్, వైజాగ్‌లలో ఉన్న ఆస్తులను విక్రయించే యోచనలో భాగంగా ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Also Read:Pawan Kalyan : సజ్జనార్ కు పవన్ అభినందనలు
టెక్నాలజీ దిట్ట, పైరసీ సామ్రాజ్యం
సాంకేతికంగా రవికి ఉన్న పట్టు కారణంగానే అతను ఈ పైరసీ సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు. టెక్నాలజీలో దిట్ట అయిన రవి, మొదటగా ఐబొమ్మ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశాడు. OTT కంటెంట్‌ను అధునాతనమైన DRM (Digital Rights Management) టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి, ఆ పైరసీ కంటెంట్‌ను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. ‘మూవీరూల్జ్’ వంటి పైరసీ వెబ్‌సైట్ల నుండి కంటెంట్‌ను తీసుకుని, దాన్ని **HD (హై డెఫినిషన్)లోకి మార్చి అప్‌లోడ్ చేసేవాడు. ఇమ్మడి రవి సుమారుగా **60 పైరసీ వెబ్‌సైట్లు** క్రియేట్ చేసి, వాటి ద్వారా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కార్యకలాపాల ద్వారా అతను ఇప్పటివరకు వందల కోట్లు** సంపాదించినట్లు అంచనా. పైరసీని అరికట్టడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చిన రవిని అరెస్టు చేయడం సినీ పరిశ్రమకు శుభపరిణామంగా చెప్పవచ్చు.