Pawan Kalyan : సజ్జనార్ కు పవన్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమకు శాపంగా మారిన పైరసీ ముఠాపై హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం యావత్ భారతీయ సినీ రంగానికి ఊరటనిచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బుల రూపంలోనే కాక, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ అవుతుండటం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో, ఈ కట్టడి చర్యలు స్వాగతించదగినవని ఆయన అన్నారు.
Also Read :Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
సినిమా విడుదలను ఒక మహా యజ్ఞంగా భావించే దర్శకనిర్మాతలకు పైరసీ ముఠాలను అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, పైరసీకి కీలక కేంద్రాలుగా ఉన్న ఐబొమ్మ (iBomma), బప్పమ్ (Bappam) వెబ్‌సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతని చేతనే వాటిని మూసివేయించడం ఒక చారిత్రక ఘట్టం అని పవన్ అన్నారు. పోలీసులకే సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు చేరుకున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందం చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది**. ఈ సందర్భంగా, ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, అలాగే సిటీ కమిషనర్ సజ్జనార్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Also Read :Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు?
సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. సజ్జనార్ కేవలం సినిమా పైరసీపైనే కాకుండా, బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ వంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయం. ఈ మోసాల వల్ల ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారని పవన్ తెలిపారు. పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా మోసానికి గురై నష్టపోతున్న విధానాన్ని సజ్జనార్ ఒక సందర్భంలో వివరించారని ఆయన గుర్తు చేశారు. అలాగే, బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు శ్రీ సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం **అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింద**ని శ్రీ పవన్ కళ్యాణ్ కొనియాడారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!