మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేది కామెంట్స్ వినిపించాయి.
Also Read : DS 2 : శేఖర్ కమ్ములతో ధనుష్ మరో సినిమా
ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు యూనిట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ నెల 12 న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లిరికల్ ‘ రామ రామ’ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి అధికారక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిరు నుండి లాంగ్ గ్యాప్ తర్వాతవస్తున్న సినిమా కావడంతో మెగా స్టార్ ఫ్యాన్స్ విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమా రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. సోషియో ఫాంటాసి కథ నేపధ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ డీలే అవడంతో విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ వేయలేదు మేకర్స్.