Hyper Adhi Responds to Janasena MLC Comments: 2024 ఎన్నికల్లో జనసేన తరఫున చాలా మంది సినీ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా హైపర్ ఆది పిఠాపురం మాత్రమే కాదు రాష్ట్రంలో పలుచోట్ల జనసేన అభ్యర్థుల తరఫున, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేదా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇక తాజాగా ఆ ప్రచారం మీద ఆది స్పందించాడు. ఆగస్టు 1వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు శివం భజే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన హైపర్ ఆది కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియా పలు ప్రశ్నలు హైపర్ ఆదికి కూడా సంధించింది.
Lavanya: శేఖర్ బాషా బాగోతం బయటపెడతా.. బిగ్ బాస్ లోకి వెళ్లడానికే ఇదంతా.. లావణ్య సంచలనం!
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్రోలింగ్ వ్యవహారంతో పాటు తనకు జనసేన ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయం మీద కూడా ఆయన స్పందించారు. తాను రాజకీయంగా ఇదేమీ చేయలేదని తనకు వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబు అంటే ఇష్టం కాబట్టి ఆయన కోసం వెళ్లి ప్రచారం చేశానని అన్నారు. ఆయన ఆనందంగా ఉంటే దూరంగా ఉండి చూడడం ఇష్టం బాధతో ఉంటే దగ్గరికి వెళ్లి చూసుకోవడం ఇష్టం అంటూ ఆయన కామెంట్ చేశాడు. అయితే ఎవరైనా పిలిచి పదవి ఇస్తానంటే తీసుకోకుండా ఉంటామా అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం గమనార్హం. ఇక తాను ప్రచారం చేయడానికి ఏపీ వెళ్లినప్పుడు రెండు నెలల పాటు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయని, అయితే మంచి పనులు చేసినప్పుడు మిస్ అయిన వాటికంటే ఎక్కువే దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి అవకాశాలే తనకు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు.