Lavanya Sensational Comments on RJ Sekhar Basha: గత కొద్దిరోజులుగా రాజ్ తరుణ్ అతని ప్రేయసిగా చెబుతున్న లావణ్య కేసుల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ తనకు కావాలంటూ రకరకాల కేసులు నమోదు చేస్తూ వస్తోంది. అయితే రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకుంటూ ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తి మీడియాలో అనేక ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య అంటుంది. ఈ విషయం మీద ఆమె ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడింది. రాజ్ తరుణ్, నా జీవితంలోకి ఆర్జే శేఖర్ భాషా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆర్జే శేఖర్ బాషా వలలో పడి పలువురు బాధితులు మోసపోయారని లావణ్య అన్నారు. ఆర్జే శేఖర్ బాషా బాగోతం అంత త్వరలో బయటపెడతా, ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆర్జే శేఖర్ భాష బాధితురాలు నన్ను సంప్రదిస్తున్నారని అన్నారు.
Polimera 2 Producer: చంపేస్తామంటున్నారు… దిల్ రాజుకు పొలిమేర 2 నిర్మాత లేఖ..!
శేఖర్ భాష బాధితులతో కలిసి నార్సింగ్ పోలీసులకు త్వరలో ఫిర్యాదు చేస్తానని లావణ్య అన్నారు. ఓవైపు రాజ్ తరుణ్ తో నాకు వివాదం నడుస్తుండగా కావాలనే రాజ్ తరుణ్ శేఖర్ భాషను ఇన్వాల్వ్ చేశాడని, టాపిక్ డైవర్ట్ చేయడానికి శేఖర్ బాషా ఎంటర్ అయ్యాడని ఆమె అన్నారు. ఆర్జే శేఖర్ భాష బిగ్ బాస్ లోకి వెళ్లి ఫేమ్ అవ్వడానికి ప్లాన్ వేశాడని ఆరోపించిన ఆమె రాజ్ తరుణ్ వదిలిన పెట్ ఆర్టిస్ట్ బాణం ఆర్జే శేఖర్ భాష అని లావణ్య అన్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ వివాదంలో నా వద్ద ఉన్న పూర్తి ఆధారాలు నార్సింగ్ పోలీసులకు అందజేశానన్న ఆమె కేసు దర్యాప్తులో ఉందని, నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా, నాకు రాజ్ తరుణ్ కావాలి అని అన్నారు. నేను డ్రగ్స్ ఎవరికీ అమ్మ లేదు ఇది అవాస్తవం అని అన్నారు. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఓ హోటల్ లో ఉన్న ఒక వీడియో వైరల్ అయింది, మాల్వి మల్హోత్రా ఎంటర్ అయ్యాకే రాజ్ తరుణ్ నాకు దూరమయ్యాడని అన్నారు.