దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ డైరెక్టర్ గా కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కం డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. ప్రదీప్ పేరు యూత్‌లో మార్మోగిపోయింది. రీసెంట్ సినిమా డ్రాగన్ తో వందకోట్ల క్లబ్ లో చేరాడు ప్రదీప్.
Also Read : WAR2 : ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్
అదే జోష్ లో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి లవ్ ఇన్సురెన్స్ కంపెనీ. అలాగే డ్యూడ్ అనే మరో యూత్ ఫుల్ సినిమా కూడా చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ దర్శకురాలు సుధాకొంగర వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కీర్తిశ్వరన్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డ్యూడ్ డిజిటల్ రైట్స్ ను రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రదీప్ రోజు రోజుకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కనుకగా రిలీజ్ కాబోతుంది. చేసిన మూడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాధ్ డ్యూడ్ తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.