తెలుగు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ప్రస్తుతం ఈయన మిస్టర్ బచ్చన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిలే అయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ హీరో రవితేజతో మూవీ కమిట్ అయ్యారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు..
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది… మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ అయ్యింది.. దాంతో మిస్టర్ బచ్చన్ సినిమా పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
ఇదిలా ఉండగా హరీష్ శంకర్ రోడ్డు పై కారును తోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కొందరు వ్యక్తులతో కలిసి హరీష్ శంకర్ ర్ రోడ్డుపై ఆగిపోయిన కారును నెడుతున్నారు. హరీష్ శంకర్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ లో ఒకరైన రవి శంకర్ కూడా ఉన్నారు.. కారు బ్రేక్ డౌన్ అవ్వడంతోనే కారును వీళ్లు రోడ్డు పక్కన పెట్టడానికి కారును తోసినట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
#EXCLUSIVE బండి కాదు.. మొండి ఇది సాయం పట్టండి pic.twitter.com/pUxdgWsj1t
— devipriya (@sairaaj44) March 14, 2024