పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” ఓజీ”. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.దర్శకుడు సుజీత్ పవన్ కల్యాణ్ ను ఏవిధంగా చూపిస్తాడో అని ప్రేక్షకులు “ఓజి” సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.”ఓజి ” చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఫ్యాన్స్ పవన్ సినిమా నుంచి ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో వుంటాయని సుజీత్ తెలిపారు..అయితే ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలవుతుంది అని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నందున పవన్ షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి రాజకీయాలలో ఫుల్ బిజీ అయిపోయారు .ఎన్నికలు ముగిసిన వెంటనే తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేస్తారు .అయితే తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్ రిలీజ్ అయింది.ఆ సినిమాను 2024 ఎండింగ్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆ టీజర్ లో ప్రకటించారు. ఒకే సంవత్సరంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అసాధ్యం. కాబట్టి ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి కచ్చితంగా వాయిదాపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో ముందుగా పవన్ ఏది పూర్తి చేస్తారో తెలియాల్సి వుంది.అయితే తాజా సమాచారం ప్రకారం “ఓజి” సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .