బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా విడాకుల రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 38 ఏళ్ల వైవాహిక బంధం ఫుల్ స్టాప్ దిశగా వెళ్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే, ఈ వార్తలపై ఆయన భార్య సునీత అహుజా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “గోవిందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఇంటికి చాలా మంది అతిథులు వస్తుండేవారు. దీనివల్ల మా కుమార్తె ఇబ్బంది పడేది. అందుకే వేరే ఇంట్లో ఉంటున్నాం. కానీ విడాకులు అనేది అసత్యం” అని క్లారిటీ ఇచ్చారు. అయిన కూడా ఈ ఆగడాలు ఆగడం లేదు.. దీంతో తాజాగా గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా వివరణ ఇచ్చారు.
Also Read : Kantara Prequel : తెలుగు స్టేట్స్‌లో ‘కాంతార ప్రీక్వెల్’కు కోట్ల డీల్ టాక్ – అంత రిస్క్ అవసరమా?
“విడాకులకు సంబంధించిన ఎలాంటి కేసు లేదు. కావాలనే కొందరు పాత విషయాలను మళ్లీ బయటకు తీస్తున్నారు” అని లాయర్ స్పష్టం చేశారు. అలాగే వినాయకచవితి సందర్భంలో గోవిందా, సునీత జంటగా కనిపిస్తారని అన్నారు. అయినా మరోసారి ఈ రూమర్స్ రావడం గమనార్హం. తాజాగా, సునీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారంటూ బాలీవుడ్ మీడియాలో రిపోర్ట్స్ రావడంతో చర్చ మళ్లీ మొదలైంది. అయితే లాయర్ స్పష్టత ఇచ్చేసరికి అభిమానులకు క్లారిటీ వచ్చింది.