Sandhya Theatre: రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సాయం.. ఎంతంటే?
- రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ఆర్థిక సాయం
- రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం
- ఇకపై బెనిఫిట్ షోలు లేవు
- ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మృతి చెందిన రేవతికి ఇప్పటికే అల్లు అర్జున్ పాతిక లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని మరొక 15 లక్షల ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయితే మరొక పక్క సుకుమార్ భార్య తబిత కూడా ఇప్పటికే ఐదు లక్షలు అందించారు. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుమారుడు పేరిట ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి పాతిక లక్షలు ఆర్థిక సాయం చేయబోతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాక ప్రభుత్వం బాలుడి వైద్య చికిత్స ఖర్చులు అన్నీ భరించనున్నట్టు ఆయన వెల్లడించారు. రేవతి కుమారుడు శ్రీ తేజ్ చిన్ననాటి నుంచే అల్లు అర్జున్ అభిమాని. అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో తండ్రిని పుష్ప సినిమా తీసుకువెళ్లాలంటూ ముందు నుంచి కోరుతూ వచ్చాడు. కుమారుడి అభిమానాన్ని కాదనలేక శ్రీ తేజ తండ్రి సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో టికెట్లు కొనుగోలు చేశారు.
Revanth Reddy: థియేటర్లోనే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తే కానీ అల్లు అర్జున్ కదల్లేదు!
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలియక కుటుంబంతో సహా ప్రదర్శనకు వెళ్లారు. కుమార్తెతో పాటు రేవతి భర్త ఉండగా రేవతి, రేవతి కుమారుడు ఒకపక్క ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తొక్కిసలాట ఏర్పడడంతో రేవతి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీ తేజ మాత్రం స్పృహ కోల్పోయాడు. తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్లగా కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. అప్పటినుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో శ్రీ తేజ చికిత్స పొందుతున్నాడు ముందుగా సినిమా టీం తరఫున అలాగే అల్లు అర్జున్ టీం శ్రీ తేజ ఖర్చులు భరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ప్రభుత్వం తరఫున శ్రీ తేజ చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తున్నట్టు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. ఇక ఇప్పుడు రేవతి కుటుంబానికి పాతిక లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం గమనార్హం.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!