యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. తాజాగా ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ “విక్రమ్” కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని ప్రకటించారు. గిరీష్ గంగాధరన్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రాలైన “నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి”, “గుప్పీ”, “అంగమలీ డైరీస్”, “జల్లికట్టు” చిత్రాలను చిత్రీకరించారు. ఉత్తమ సినిమాటోగ్రఫీకి జాతీయ అవార్డును గెలుచుకున్న గిరీష్ తలపతి విజయ్, ఎఆర్ మురుగదాస్ ల ’సర్కార్’ సినిమాకు కూడా పని చేశారు.
Read Also : నవీన్ పోలిశెట్టి మూవీలో విజయ్ దేవరకొండ!
ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పలువురు ప్రముఖలు నటించనున్నారు. ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి, నరైన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ‘విక్రమ్’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టంట్ కో-ఆర్డినేటర్స్ అన్బరివ్ కూడా ఈ సినిమాలో వర్క్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.