యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. తాజాగా ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ “విక్రమ్” కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని ప్రకటించారు. గిరీష్ గంగాధరన్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రాలైన “నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి”, “గుప్పీ”, “అంగమలీ…