సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ కొడుకు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్ ఎక్స్ 100, మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : SPIRIT : రెబల్ స్టార్ స్పిరిట్ లో మెగాస్టార్.. పక్కా..?
తిరుపతి నేపధ్యంలో జరిగే ప్రేమ కథగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. హీరో, హీరోయిన్ కలిసి పిస్టల్ పట్టుకోగా ఆ పిస్టల్ పై గోవింద నామాలు ‘రెండు జీవితాలు, ఒకటే ప్రయాణం రెండు చేతులు, ఒకటే ప్రమాణం రెండు మనసులు, ఒకటే విధి’ శ్రీనివాస మంగాపురం’ ప్రేమ కథల లో ఈ కథ కూడా ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుంది’ అని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్ , ఇతర అప్డేట్స్ త్వరలోనే అధికారక ప్రకటన రాబోతుంది. ఈ సినిమా కోసం జయకృష అటు యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిటిలోను దర్శకుడు అజయ్ భూపతి దగ్గరుండి మరి శిక్షణ ఇస్తున్నాడు. జయకృష్ణ తొలి సినిమా పర్ఫెక్ట్ గా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అజయ్ భూపతి. జయకృష్ణ సరసన హీరోయిన్ గా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రష తడానీ హీరోయిన్ గా నటిస్తోంది.