పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సందీప్ వంగా తమ హీరోను ఎంత రెబల్ గా చూపిస్తాడోనని భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
Also Read : Kollywood : యు టర్న్ తీసుకున్న స్టార్ హీరో.. ఆ పాత్రలకు గ్రీన్ సిగ్నల్
అయితే ఈ సినిమా గురించి గత కొంత కాలంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడని, రెబల్ స్టార్ ప్రభాస్ కు తండ్రిగా కనిపిస్తారని టాక్ కూడా వినిపించింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరు ఫ్యాన్ కావడం అందులోను స్పిరిట్ ఓపెనింగ్ కు చిరు రావడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి.అయితే ఈ వార్తలపై స్పిరిట్ యూనిట్ సభ్యుల నుండి అందిన సమాచారం మేరకు స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరు నటిస్తున్నాడు అనేది పక్కా ఫేక్ న్యూస్ అట. అసలు అలాంటి ప్రతిపాదనే లేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ ఫేక్ న్యూస్ అని తెలిపారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరులో ప్రభాస్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ప్రసుత్తం రాజాసాబ్, ఫౌజీ షూటింగ్స్ లో బిజిగా ఉన్నాడు రెబల్ స్టార్. స్పిరిట్ ఎప్పుడు వచ్చిన సరే రికార్డులు కొల్లగొట్టడం మాత్రం ఖాయం.