Game Changer: టాలీవుడ్లో హిస్టరీ.. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్న గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ మరో సెన్సేషన్ క్రియేట్ చేయటానికి సిద్ధమైంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ కార్యక్రమానికి వేదిక కానుండటం విశేషం.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరుకాబోతున్నారు. యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగలేదు..జరగబోదు అనేంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. రామ్ చరణ్‌పై అభిమానంతో రాజేష్ కల్లెపల్లి ఇంత పెద్ద ఈవెంట్‌ను చేయనుండటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా రాజేష్ కల్లెపల్లి మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు యు.ఎస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించలేదు. తొలిసారి గేమ్ చేంజర్ సినిమా కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయటానికి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన హీరో రామ్ చరణ్‌గారు, నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, శంకర్‌గారు అండ్ టీమ్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!