CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- CEC జ్ఞానేష్ కుమార్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- ఫారమ్-6లో మార్పులు, ఈసీఐ ఏకపక్ష నిర్ణయాలపై పిల్..
- అక్టోబర్ 27న సుప్రీంకోర్టులో కీలక విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CEC Gyanesh Kumar: ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తు్న్నాయి. మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై అక్టోబర్ 27న విచారణ జరుగనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి (ఈసీ), సీఈసీకి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు సోమవారం ఈ ఉత్తర్వుల్ని జారీ చేసింది.
సోమవారం జరిగిన విచారణలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నింటిని తాము పరిశీలిస్తామని, చట్టానికి విరుద్ధొంగా ఉన్నట్లు తేలితే ఏ నిర్ణయాన్నైనా కొట్టిపారేస్తామని చెప్పింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఎన్నికల సంఘం పలు నిర్ణయాలను తీసుకుందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే, ఫారమ్-6లో ఎలాంటి మార్పుల్ని ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారమ్ -6లో ఎవరు మార్పులు చేశారనే విషయాన్న పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ముఖ్యంగా ఫారమ్-6లో మార్పులు చేశారనే వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. ఫారమ్-6లో మార్పుల గురించి ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఫారమ్-6లో ఒక్క కామా, ఫుల్ స్టాప్ కూడా మార్చలేదని, ఎస్ఐఆర్ ఫారం-6కు అదనంగా ఒక డిక్లరేషన్ జత చేసినట్లు చెబుతోంది. జ్ఞానేష్ కుమార్ తదుపరి నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించడంతో పాటు ఆయనను సస్పెండ్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులను పిటిషనర్లు కోరినప్పటికీ.. ఈసీఐని సస్పెండ్ చేస్తే ఎవరు ఎన్నికల్ని నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!