సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. మాకు అన్ని రకాలుగా సహకారం అందించిన ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.
Also Read : Tollywood : బక్కోడికి రజనీకాంత్.. బండోడికి బాలయ్య.. పూనకాలే
అలాగే ఇటీవల నా జడ్జెమెంట్ తప్పిందని కామెంట్స్ వినిపించాయి. ఫామిలీ స్టార్ ప్లాప్ తర్వాత నా ఏడేళ్ల మనవడు తాత నువ్వు టెన్షన్ పడకు నీ చేతిలో గేమ్ ఛేంజర్ ఉంది అని అన్నాడు. ఆ క్షణం నన్ను నేను జడ్జ్ చేసుకుని ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను. దిల్ రాజు జడ్జ్ మెంట్ పోయిందా అని మాటలు వినిపించాయి. ఇండస్ట్రీలో సక్సెస్ లేకుంటే ఎవరు కనీసం వాల్యూ ఇవ్వరు. మరోవైపు శంకర్ సినిమా ఇండియన్ -2 ప్లాప్ కావడంతో ఆయన చేసే గేమ్ ఛేంజర్ ఏముంటది అని అనేక మాటలు విన్నాను. దీంతో శంకర్ నాలుగేళ్ళ క్రితం నాకు ఏ కథ అయితే చెప్పాడో అది వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ, ఈ సినిమా రిజల్ట్ మీకు, నాకు చాలా ముఖ్యం అని శంకర్ కు గుర్తు చేస్తూ పక్కాగా రెడీ చేసాం. ఇప్పుడు చెప్తున్నాను ఈ గేమ్ ఛేంజర్ నాకు, శంకర్ కు కంబ్యాక్ ఫిల్మ్ ఈ మాట నేను కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను’ అని అన్నారు.