ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అసలు సిసలైన గేమ్ మొదలైనట్టే. జనవరి 10న సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూఎస్‌లో కేవలం ప్రీమియర్ షోలకే పది వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాల సమయం ఉండటంతో ఈ నెంబర్ మరింతగా పెరిగడం ఖాయం. ఖచ్చితంగా రిలీజ్ వరకు ‘గేమ్ ఛేంజర్’ యూఎస్ ప్రీ సేల్స్ పరంగా రికార్డు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు.
Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం
ఇప్పటికే అమెరికాలో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు ప్రీమియర్స్ టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే ప్రీ సేల్స్ మరింతగా ఊపందుకోనున్నాయి. సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేలా సాలిడ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ట్రైలర్ కట్‌తో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఎక్కడ చేయనున్నారు? ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయంపై మేకర్స్ సైడ్ రేపో మాపో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.