తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్‌లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్‌పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో పడేశాయి.
Also Read : LYCA : ఆ హీరో సినిమాతో నిండా మునిగిన అతడే కావాలంటున్న లైకా ప్రొడక్షన్స్
వరుస ప్లాపులు వాణి కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నాని సరసన ఆహా కళ్యాణం చేస్తే బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది. ఇక అప్పటి నుండి సౌత్ మొహమే చూడలేదు అమ్మడు. బాలీవుడ్‌లోనే తాడో పేడో తేల్చుకుందామని ప్రిపేర్ అయ్యింది. చివరకు ఆమె ఫేట్‌ను మార్చేశాడు అజయ్ దేవగన్. రైడ్ 2లో ఇలియానా ప్లేసును గాయబ్ చేసిన వాణి ఖాతాలో ఎట్టకేలకు ఓ హిట్ పడింది. మే 1న రిలీజైన మూవీ రూ. 70 కోట్లను దాటి వంద కోట్లకు పరుగులు పెడుతోంది. రైడ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ హిట్ కొట్టడంతో ఆడియన్స్, క్రిటిక్స్, మీడియాకు థాంక్స్ చెప్పింది. అయితే రైడ్ 2తో హిట్ కొట్టింది అనుకుంటే. మరో సినిమా వివాదంలో నెలకొంది. మే 9న అబీర్ గులాల్ రిలీజ్ కావాల్సి ఉండగా పహల్గాం అటాక్ కారణంగా వివాదంలో చిక్కుకుంది. ఇందులో నటించిన హీరో పవాద్ ఖాన్ పాకిస్తాన్‌కు చెందిన నటుడు. దాంతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే అమ్మడి స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లడం ఖాయం.