69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో పలువురు తారల నృత్యప్రదర్శనాలు ఆకట్టుకున్నాయి.
69వ SOBHA ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (మలయాళం) విజేతల పూర్తి జాబితా::
* ఉత్తమ చిత్రం- 2018
*ఉత్తమ దర్శకుడు- జూడ్ ఆంథనీ జోసెఫ్ (2018)
*ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) కథల్- ది కోర్ – (జియో బేబీ)
*ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (Male)- మమ్ముట్టి (నన్‌పాకల్ నేరతు మయక్కం)
*ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – జోజు జార్జ్ (ఇరట్ట)
*ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (Female) – విన్సీ అలోషియస్ (రేఖ)
*ఉత్తమ నటి (క్రిటిక్స్) – జ్యోతిక (కథల్- ది కోర్)
*సహాయక పాత్రలో ఉత్తమ నటుడు (male) – జగదీష్ (పురుష ప్రేమ)
* సహాయక పాత్రలో ఉత్తమ నటి (Female) – పూర్ణిమ ఇంద్రజిత్ (తురముఖం) & అనశ్వర రాజన్ (నెరు)
* ఉత్తమ సంగీత ఆల్బమ్ – RDX (SAM CS)
* ఉత్తమ సాహిత్యం – అన్వర్ అలీ (ఎన్నమ్ ఎన్ కావల్- కథల్- ది కోర్)
* ఉత్తమ నేపథ్య గాయకుడు (male) – కపిల్ కపిలన్ (నీలా నిలవే- RDX)
* ఉత్తమ నేపథ్య గాయని (Female) – KS చిత్ర (ముత్తతే ముల్లా- జవాను ముల్లప్పువుమ్)