త్వరలో ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిధి అగర్వాల్, తాజాగా ‘ఆస్క్ నిధి’ అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఒక అభిమాని, “బంగారం, మీ అమ్మగారి నంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను, ప్లీజ్ ఇవ్వచ్చుగా?” అంటూ కామెంట్ చేయగా, దానికి ఆమె, “అవునా, నాటీ!” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది.
Also Read:Nidhhi Agerwal: అగర్వాల్స్ ఏం తింటే ఇంత అందంగా ఉంటారో తెలుసా ?
వాస్తవానికి ఇలాంటి కామెంట్లకు స్పందించకుండా వదిలేయడం లేదా కాస్త ఘాటుగా సమాధానం ఇవ్వడం చేస్తుంటారు, కానీ నిధి అగర్వాల్ మాత్రం చాలా సరదాగా తీసుకుంటూ ఈ విషయంలో కామెంట్ చేసింది. అలాగే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న అన్‌కండిషనల్ లవ్ ఎలా ఉందని అడిగితే, తాను ఆ అన్‌కండిషనల్ లవ్‌ను ఫీల్ అవుతున్నానని, ఇలాంటి ప్రేమ దొరుకుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చింది.
Also Read:Nampally Court: అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఇక ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని పేర్కొన్న ఆమె, ప్రీ-రిలీజ్ స్పీచ్ గురించి తలుచుకుంటే ఇప్పుడే టెన్షన్ వస్తుందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే, “పవన్ కళ్యాణ్ గారి ఎదురుగా కూర్చొని ఉంటాను, నేనేం మాట్లాడగలను, ఎలా మాట్లాడగలను? అప్పుడు నన్ను సపోర్ట్ చేయండి” అని కామెంట్ చేసింది. అంతేకాక, ‘హరిహర వీరమల్లు’ తన లిటిల్ బేబీ లాంటిదని, సినిమా మీద మరియు సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉందని చెప్పుకొచ్చింది.