కాదేదీ ఫ్యాన్ వార్స్‌కు అతీతం అనేట్టుగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. నిజానికి ఈ ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ కేవలం సినిమాలు రిలీజ్ అయినప్పుడు లేదా ఒక హీరో రికార్డు మరో హీరో బద్దలు కొట్టినప్పుడు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన యాడ్ రెమ్యూనరేషన్ వ్యవహారంలో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం మీద ఇతర హీరోల అభిమానులు ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.
Nani : రివ్యూలు ఆపాలా?ఎవరు ఆగుతారు? ఎందుకు ఆగుతారు?
ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు కొంతమంది మహేష్ బాబు నోటీసుల అంశాన్ని ప్రస్తావిస్తూ, అప్పుడు మా ప్రభాస్ మీద ల్యాండ్ కబ్జా ఆరోపణలు చేశారు, తర్వాత ఆహా బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ చేశారని ఆరోపణలు చేశారు, ఇప్పుడు కర్మ హిట్స్ బ్యాక్, మహేష్ బాబు మీద కేసు నమోదు అయింది అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులు కూడా మనకు గట్టిగానే కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. కేసు నమోదైంది సదరు నిర్మాణ సంస్థ మీద, మహేష్ బాబుకు కేవలం రెమ్యూనరేషన్ వ్యవహారం మీద క్లారిటీ ఇవ్వమని నోటీసులు ఇచ్చారు అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది అని చెప్పక తప్పదు.