తెలుగు సినీ పరిశ్రమకు.. విశిష్టమైన సంగీతం అందించిన సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో, ఆయన సంగీతం ఎన్నో సినిమాలకు ప్రాణం పోసింది. అయితే, ఇటీవల కొన్ని సంవత్సరాలుగా దేవి శ్రీ కి వరుసగా సరైన హిట్‌లు లేవు. పుష్ప: ది రైజ్ మినహా, ఆయనకు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులు తక్కువే. వాల్తేరు వీరయ్య వంటి ఆల్బమ్‌లు మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, అవి DSP స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు దేవి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు..
Also Read : Harihara Veeramallu : ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..
‘పుష్ప 2: ది రూల్’, ‘థాండెల్’, ‘కుబేరా’ వంటి వరుస భారీ చిత్రాలతో, DSP మళ్లీ తన పంజా చూపిస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ఆయన మ్యూజికల్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశారని చెప్పవచ్చు. పుష్ప 2 పాటలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, ఈ సౌండ్‌ట్రాక్ సినిమాపై హైప్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ‘థాండెల్’ పాటలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా విడుదలైన కుబేరా చిత్రం కూడా మంచి టాక్ తో పాటు, దేవీ శ్రీ సంగీతం ఎంతో బలాన్నిచ్చింది. పాటలు తక్కువగా ఉన్నా.. సినిమా మూడ్‌ను మలచడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇకపై ఆయన నుంచి మరిన్ని అద్భుతమైన ఆల్బమ్‌ల కోసం ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.