Harihara Veeramallu : ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. కృష్ణం రాజ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. మొదటి నుండి పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 24, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ అధికారికంగా ఈ అప్డేట్ ప్రకటించడంతో, పవన్ ఫ్యాన్స్‌లో దిల్ కుష్ అవుతున్నారు.
Also Read : Shruti Hassan : దాని గురించి దాచాల్సిన అవసరం లేదు..
Also Read
ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్ (ఔరంగజేబ్‌గా), నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే పోస్టర్స్, మేకింగ్ వీడియోలతో, ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసిన “హరి హర వీరమల్లు” ఇప్పుడు విడుదలకు రెడీ అయింది. పవన్ మరోసారి తన పవర్‌ను చూపించనున్నారు. అంతే కాదు త్వరలో మేకర్స్ ఓ పవర్‌ఫుల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నా, సినిమాతోను తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేస్తున్నారు.
ఇక కథ విషయానికి వస్తే ‘హరి హర వీరమల్లు’ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ ఇందులో ఓ వీరయోధుడిగా కనిపించనున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో పవన్ కనిపించనున్నట్లు టీజర్స్‌తో అర్థమవుతుంది. ఈ సినిమా నేపథ్యం, నిర్మాణ విలువలు ఎంతో గ్రాండ్‌గా ఉండటంతో ఇది ఒక విజువల్ ట్రీట్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.
One fights for Power.
One fights for Dharma.
The clash of legacies begins. 🔥Witness the Battle for truth, faith and freedom 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒, 𝟐𝟎𝟐𝟓 ⚔️🔥
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu 🏹#HHVMonJuly24th #HHVM… pic.twitter.com/HdMr2LQwqC
— jyothi krisna (@amjothikrishna) June 21, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!