ఎప్పుడో నాలుగేళ్ల క్రితం స్టార్ట్ అయిన సినిమా.. మొదలు పెట్టిన దర్శకుడు మధ్యలో తప్పుకున్నాడు. అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ చేద్దామంటే అనేక సమస్యలు. వీటన్నిటిని దాటి నేడు థియేటర్స్ లోకి వచ్చింది పవర్స్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. ఎ ఎం రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Read : HHVM : వీరమల్లు ఓవర్సీస్ రివ్యూ.. అద్భుతం
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్లు కెమెరాకు దూరంగా ఉన్న పవర్ స్టార్ గ్యాప్ తర్వాత నటించినా కూడా అద్భుతమైన పర్ఫెమెన్స్ చేసాడు. ఖుషి టైమ్ లో పవర్ స్టార్ ఎంత ఈజ్ తో నటించే వాడో ఇప్పుడు కూడా అంతే స్థాయిలో మెప్పించాడు. డైలాగ్ డెలివరీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంకో పదేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ డైలాగ్ అంటే ఆడియెన్స్ కు కిక్ ఇస్తుంది. యాక్షన్ సన్నివేశాలలోను పవర్ స్టార్ తన పవర్ చూపించాడనే చెప్పాలి. శత్రువులకు వార్నింగ్ ఇచ్చే లాంటి సీన్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించాయి. అసలు మొన్నటి వరకు ఎవరు అంతగా మాట్లాడుకొని హరిహర వీరమల్లుకు ఇంత బజ్ ఇంతటి క్రేజ్ వచ్చిందంటే కేవలం అది పవర్ స్టార్ మ్యానియా అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే పేరు టాలీవుడ్ లో ఎప్పటికీ క్రేజ్ తగ్గని ఓ ‘పవర్ స్టార్’. అందుకె ఆయనకు ఆ పేరు.