టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తనదైన నటనతో తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పాడు కోట శ్రీనివాసరావు. సినీ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న…