డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్. ఇప్పటికే ఎవరి గురించి చెబుతున్నామో మీకు టైటిల్ లోనే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆయన ఇంకెవరో కాదు వశిష్ట. ఈరోజు డైరెక్టర్ వశిష్ట పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం.
Shraddha Srinath: బాలయ్యని అలా అనాలంటే భయమేసింది!
బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మల్లిడి. అల్లు అర్జున్ తో బన్నీ, రవి తేజతో భగీరథ, విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడే ఈ వేణు. ముందుగా వేణు హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ నటుడిగా వర్కౌట్ కాకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయిపోయాడు అనుకున్నారు. అయితే నిజానికి ఆయన పట్టు వదలని విక్రమార్కుకుడు లా సినీ పరిశ్రమలోనే ఉన్నాడు. కొన్నాళ్ల పాటు రీ సెర్చ్ చేసి ఈసారి డైరెక్టర్ గా లక్ చెక్ చేసుకున్నాడు. అలా దర్శకుడిగా ఆయన చేసిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక రకంగా దశ తిరిగి పోయినట్టుంది. ఆ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తాడా? అని అందరూ ఎదురు చూసారు. అయితే దర్శకుడుగా ఎవరూ ఉహించని విధంగా రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం దక్కించుకొని విశ్వంభర పేరుతో ఒక సోషియో ఫాంటసీ డ్రామా మూవీ చేస్తున్నాడు. ఒకరకంగా ఆయన లైఫ్ లో ఇది అతి పెద్ద ఎచీవ్మెంట్ గా భావిస్తున్నట్టు పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పకొచ్చాడు. ఆ సినిమా సంక్రాంతికి రావాలి కానీ అది గేమ్ చేంజర్ కోసం కాస్త వెనక్కి జరిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.