Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా ప్రమోషన్ల వివాదం ఎట్టకేలకు ఒక సుఖాంతానికి చేరింది. ప్రమోషన్లకు హీరోయిన్ రావడం లేదనే టెన్షన్లో, నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వరలక్ష్మి శరత్‌కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలు పూర్తిగా పొరపాటని ఒప్పుకుంటూ, వరలక్ష్మికి ఆయన బహిరంగ క్షమాపణలులు చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. అసలు ఈ సినిమా కథను తానే స్వయంగా వరలక్ష్మి గారిని మైండ్‌లో పెట్టుకుని రాశానని గుర్తుచేసుకున్నారు. “వరలక్ష్మి గారితో స్క్రిప్ట్ డిస్కషన్స్ దగ్గర నుంచి షూటింగ్ ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. నన్ను ఒక సొంత అన్నయ్యలా, మా ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేశారు. షూటింగ్ సమయంలో ఆవిడ చేతికి తీవ్రమైన గాయమైనా సరే, నిర్మాతకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో కట్టు కట్టుకుని మరీ వచ్చి నటించారు. ఆమె ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ ప్రాజెక్ట్ పూర్తయింది.” అని చెప్పుకొచ్చారు. సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక జూన్ 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. అయితే, విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కోసం వరలక్ష్మి గారి డేట్స్ అడిగాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ అందుబాటులోకి రాలేదు. దాంతో, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మాతలు, బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి పెరిగింది.
Also Read
ఆ టెన్షన్, బాధలోనే నిన్న (జూన్ 10) జరిగిన ప్రెస్ మీట్లో వరలక్ష్మి గురించి కొన్ని అనుకోని మాటలు దొర్లాయి. నేను వల్గర్‌గా మాట్లాడకపోయినా, ఆమెను బాధపెట్టేలా మాట్లాడటం నా తప్పే. అందుకే మనస్ఫూర్తిగా ఆమెకు ‘ఐ యామ్ సారీ’ చెబుతున్నాను అని సంజీవ్ పేర్కొన్నారు. డైరెక్టర్ సంజీవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో మూవీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు, సహనటులు వెంటనే స్పందించారు. సీనియర్ నటుడు రఘుబాబు, సప్తగిరితో పాటు పలువురు ప్రముఖులు డైరెక్టర్‌కు ఫోన్ చేసి క్లాస్ పీకారట. “నువ్వు ఎప్పుడూ ఇలా మాట తూలే వ్యక్తివి కావు కదా, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడావు? వరలక్ష్మి గారు ఏ సినిమా ప్రమోషన్లకైనా ఎంతో లాయల్‌గా ఉంటారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏమైనా ఆవిడను హర్ట్ చేశారా?” అంటూ గట్టిగా నిలదీశారు. ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి, తన తప్పు తలచుకుని హర్ట్ అవ్వడంతో డైరెక్టర్ వెంటనే వీడియో విడుదల చేసి క్షమాపణలు ప్రకటించారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!