దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు దాదాపు పది చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు హిందీ రీమేక్స్ కూడా ఉన్నాయి. అలానే ఆయన చేతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందలాది థియేటర్లు ఉన్నాయి. ఇక ప్రతిష్ఠాత్మక చిత్రాలెన్నింటినో ఆయన పంపిణీ చేస్తుంటారు. అయితే… కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో థియేటర్లు మూతపడటంతో వాటి లీజుదారులందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్లు నడవకపోయినా ఎంతో కొంత మొత్తాన్ని దాని మెయిన్ టెన్స్ కు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు.…