థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లడుతూ అందరికీ నమస్కారం ముందుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. ఈ రోజు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్న ఒక వివాదాన్ని ఈరోజు వారు ముగించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ఒక నిర్మాత ఒక డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Also Read : Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాకిచ్చిన కోర్టు..!
సమస్య ఎక్కడో మొదలైంది. మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో అన్ని సద్దుమణిగి పోయాయి. మీడియా మిత్రులను కూడా నేను కోరేది ఒకటే. ఆ కంక్లూజన్ గురించే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. కాబట్టి ఈరోజు మీ వీడియో ముందుకు వచ్చాను. దయచేసి ఇక్కడ మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఎలాంటి కాంట్రవర్సీ అంశాలను ఇక్కడ లేని విషయాలను మీరు కావాలని పుట్టించకండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.