హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘నా బాధ్యతగా ఇక్కడకు వచ్చా, నేను, నా చుట్టూ ఉన్న వారు డ్రగ్స్ తీసుకోకుండా చూసే బాధ్యత నాది. యువత చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే హెల్త్, మనీ, సక్సెస్, రెస్పెక్ట్ ఇవి మనిషికి చాలా ముఖ్యం కానీడ్రగ్స్ తీసుకోవడం వల్ల మనిషికి ఇవన్నీ దూరమవుతాయి అని అన్నారు.
Also Read:Ram Charan: పేరెంట్ గా ఆలోచిస్తే భయమేస్తోంది.. డ్రగ్స్ పై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు
లైఫ్‌లో తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే గొప్ప అచీవ్‌మెంట్ ఇంకోటి లేదన్న విజయ్ ఎప్పుడూ వారు తలదించుకునే పని చేయకూడదన్నారు. సమాజంలో డ్రగ్స్ తీసుకునేవారిని చిన్నచూపు చూస్తారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అవసరమా?. మనతో పాటు మన పేరెంట్స్‌ను కూడా సమాజం దోషుల్లా చూస్తుంది. నా అభిమానులు, తెలుగు సినిమా ఫ్యాన్స్, టోటల్ తెలంగాణ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరుతున్నానని విజయ్ అన్నారు. మనం, మన స్టేట్, మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉండాలి, దానికి మనవంతు కృషి తప్పకుండా చేయాలి. అన్నిటికంటే ముందు డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం ఫ్రెండ్స్‌ను కట్ చేయండి. తప్పకుండా డ్రగ్స్‌కు దూరంగా ఉందాం’ అని విజయ్ దేవరకొండా అన్నారు.