గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది బాలీవుడ్ మూవీ ధురంధర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించి.. బాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది. దీంతో.. ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ‘ధురంధర్ 2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా షేక్ అయింది. అయితే, ఈ సీక్వెల్ మాత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read : Naizam : నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెడుతున్న యంగ్ ప్రొడ్యూసర్
బిజినెస్ పరంగా ధురంధర్ 2 సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ అయినట్టుగా ట్రేడ్ వర్గాల అంచనా. ధురంధర్ 2 నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 250 కోట్లకు పైగా జరుగుతున్నట్టుగా లెక్కలు వేస్తున్నారు. సినిమా బడ్జెట్ రూ. 250 కోట్లు కాగా.. రిలీజ్‌కు ముందే మేకర్స్‌ను లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఆడియో రైట్స్ కోసం టీ-సిరీస్ సంస్థ ఏకంగా రూ. 60 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి సంస్థ జియోహాట్‌స్టార్ డిజిటల్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 150 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ టాక్. శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా.. సినిమా విడుదలకు ముందే కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారానే 250 కోట్లకు పైగా వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఇక థియేటర్లలో వచ్చేదంతా లాభమేనని అంటున్నారు. మరి ధురంధర్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.