Dhurandhar 2: సంచలనం.. వారం రోజుల్లో వెయ్యి కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇందులో ఇండియాలోనే రూ. 695 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయడం సినిమా దూకుడుకు నిదర్శనం. వీక్‌డేస్‌లో కూడా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఐదో రోజు రూ. 65 కోట్లు, ఆరవ రోజు రూ. 56 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘ధురంధర్ 2’ దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల మార్క్‌ను దాటేసి, గ్లోబల్ స్థాయిలో భారీ వసూళ్లను అందుకుంటోంది.
Also Read: Ram Charan: పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం!
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ఈ వేగాన్ని చూస్తుంటే, కేవలం వారం రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అత్యధిక వేగంగా వారం రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనుంది ధురంధర్ 2. సుమారు నాలుగు గంటల భారీ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం విశేషం. మొదటి భాగం సుమారు రూ. 1400 కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ రూ. 2000 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్‌లో హిట్ సినిమాలకు లాంగ్ రన్ ఉండటం ఈ అంచనాలకు బలం ఇస్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ తన పవర్‌ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. మొత్తానికి ‘ధురంధర్ 2’ భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకెళ్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?