Ram Charan: పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా.. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసేలా దూసుకుపోతోంది చిత్ర యూనిట్. ప్రజెంట్ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్‌కు గాయం అయినట్టుగా తెలుస్తోంది. ఆయన కంటి సమీపంలో స్వల్ప గాయం అయిందని సమాచారం. ఈ వార్త తెలియగానే అభిమానులు కాస్త ఆందోళన చెందినప్పటికీ, ఇది చాలా చిన్న గాయమని, అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
Also Read: Dhurandhar 2: ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా లేదు.. పుష్ప రికార్డ్ బ్రేక్, నెక్స్ట్ బాహుబలి!
Also Read
అయితే, కంటికి సంబంధించిన గాయం కావడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. అలాగే.. రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారు. దీంతో.. రెండు రోజుల రెస్ట్ తర్వాత తిరిగి రామ్ చరణ్ పెద్ది సెట్స్‌లో జాయిన్ అవనున్నారు. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత.. తదుపరి షెడ్యూల్‌లో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇక్కడితో షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్టే. మరోవైపు, ఈ శుక్రవారం మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు అభిమానులు. ఆరోజు పెద్ది టీజర్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చరణ్‌కు గాయం అనే వార్త మెగాభిమానులను కాస్త టెన్షన్‌కు గురి చేసినట్టైంది. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు అభిమానులు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!