Bison : ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన తాజా చిత్రం ‘బైసన్’ ఇటీవల దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను ప్రతిభావంతుడైన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ధ్రువ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘బైసన్’ నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
Also Read : S. S. Rajamouli : షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు
Also Read
ఈ సినిమాలో ధ్రువ్‌తో పాటు రజిషా విజయన్ (అక్కగా), అనుపమ పరమేశ్వరన్ (హీరోయిన్‌గా), పశుపతి (తండ్రిగా) కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు అమీర్, నటుడు లాల్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సంగీతం నివాస్ కే. ప్రసన్న అందించగా, సినిమాను పా. రంజిత్ స్వంత బ్యానర్ నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఒక గ్రామానికి చెందిన పేద కుర్రాడు కబడ్డీ ఆట ద్వారా అర్జున్ అవార్డు స్థాయికి ఎలా ఎదిగాడో చూపించే ఈ స్పూర్తిదాయక కథ ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..