వి 4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం “దర్శిని”. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. తాజగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాను మే 17న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్వి సూర్యం మాట్లాడుతూ “మా ‘దర్శిని’ సినిమాకి సెన్సార్ సభ్యులు యూ/ ఏ ఇచ్చి మా సినిమాను ప్రశంసించారు. సినిమా చాలా బాగుంది అని అన్నారు.
Also Read;Sukumar : ఆర్య షూటింగ్ సమయంలోనే బన్నీకి ఆ ప్రామిస్ చేసా..?
మే 17న విడుదల కు సిద్ధంగా ఉన్నాము, మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశాడు. ముగ్గురు మిత్రులకి భవిష్యత్తును చూపించే యంత్రం దొరికితే దాని వల్ల వచ్చే పరిణామాలు, పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా సినిమాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా సినిమా బాగా నచ్చుతుందని తెలిపారు. రవి మిల్కీ కెమెరా మాన్ గా వ్యవహరించిన ఈ సినిమాకి ప్రవీణ్ జైరాజ్, చందు చలమల ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. నిజాని అంజన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శివ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తూన్నారు.