చిక్కుల్లో రామ్, లింగుసామి “రాపో19”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో కాపీ వివాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో ఎ.ఆర్.మురుగదాస్, శంకర్ వంటి దర్శకులు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పందెం కోడి’ ఫేమ్ లింగుసామి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆ మూవీపై మరో తమిళ దర్శకుడు సీమాన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం లింగుసామి ఈ కథను 2013లో రాసి, సూర్యతో కలిసి రూపొందించాలని ప్లాన్ చేశారట. కానీ ఈ కథ తాను విజయ్ తో తీయాలనుకున్న ‘పగళవన్’ కథను ఆ కథ పోలి ఉందంటూ అప్పట్లోనే ఫిర్యాదు చేశారట.
Read Also : ‘ద ఫ్యామిలి మెన్’ రాజ్ అండ్ డీకే… టాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్!
Also Read
దీంతో ఇద్దరూ ఒకేలాంటి కథను రాసుకున్నారని తెలుసుకుని, తమిళనాడు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించింది. ఆ తరువాత లింగుసామి సూర్య కోసం వేరే కథ రాసి 2014లో ‘అంజన్’గా చేశాడు. మరోవైపు సీమాన్ ‘పగళవన్’ని తెరకెక్కించలేకపోయాడు. అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత అప్పట్లో వివాదానికి కారణమైన స్క్రిప్ట్ నే లింగుసామి మరోసారి ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న సీమాన్ మరోసారి సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అసోసియేషన్ లింగుసామి నుండి వివరణ కోరినప్పుడు, ఈ సమస్య 2013లోనే పరిష్కరించబడిందని, అక్కడ డైరెక్టర్ల సంఘం నుండి క్లీన్ చిట్ వచ్చిందని అన్నారు. తమిళం మినహా ఇతర భాషలలో ఈ స్క్రిప్ట్‌తో సినిమాను తెరకెక్కించవచ్చని పేర్కొన్నాడు. అతని వివరణను పరిశీలించిన తరువాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లింగుసామికి క్లీన్-చిట్ ఇచ్చి, అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని పేర్కొంది.
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!