‘ద ఫ్యామిలి మెన్’ రాజ్ అండ్ డీకే… టాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్!

‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో ‘రాజ్ అండ్ డీకే’ ఫెమిలియర్ నేమ్స్ అయిపోయాయి. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ స్టుపెండస్ సక్సెస్ వార్ని మరింత సాట్ ఆఫ్టర్ డైరెక్టర్స్ గా మార్చేసింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో రాజ్ అండ్ డీకే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. రాశీ ఖన్నా ఇందులో ఫీమేల్ లీడ్. కాగా మన టాలెంటెడ్ డైరెక్టర్స్ డ్యుయో మూవీ ప్రొడక్షన్ పై కూడా దృష్టి పెట్టారు…

Read Also : మోస్ట్ పవర్ ఫుల్ వాటర్ ఫాల్స్ ఆడవాళ్ళ కన్నీళ్ళు: భాగ్యరాజ్

రాజ్ అండ్ డీకే గతంలో ‘సినిమా బండి’ పేరుతో ఓ సినిమా నిర్మించారు. ఆ సినిమాతో వారికి తెలుగులో మంచి ఆరంభమే లభించింది. అయితే, ఇప్పుడు మరోసారి ఓ స్మాల్ బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నారట. కొన్ని కథలు కూడా విని ఒక స్క్రిప్ట్ ఓకే చేసినట్టు సమాచారం. డెబ్యూ డైరెక్టర్ ఒకరు రాజ్ అండ్ డీకే ప్రొడక్షన్ కి దర్శకత్వం వహిస్తారట.

జాతీయ స్థాయిలో ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో సంచలనం రేపిన రాజ్ అండ్ డీకే తెలుగులోనూ ఒక సిరీస్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే, ఇంకా మంచి కథల కోసం అన్వేషణ సాగుతోందట. వన్స్ స్టోరీ లాకైతే… నటీనటుల ఎంపిక పై దృష్టి పెడతారని టాక్. చూడాలి మరి, రాజ్ అండ్ డీకే తెలుగు సినిమా, తెలుగు వెబ్ సిరీస్ లో గొల్డెన్ ఛాన్స్ ఎవర్ని వరిస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-