సూపర్ స్టార్ రజినీకాంత్.. 7 పదుల వయస్సు దాటిన ఇప్పటికి సౌత్ ఇండియా లోని అందరు హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిన్న గాక మొన్న షూటింగ్ ప్రారంభం అనే వార్త రాగా, అప్పుడే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. దీంతో ఈ మూవీ కోసం కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, కోలీవుడ్,టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉన్నాయట.
Also Read: Manoj Kumar : ప్రముఖ హిందీ నటుడు కన్నుమూత ..
సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.40 కోట్ల రూపాయలకు జరిగినట్లు తెలుస్తుంది. అదే విధంగా OTT నెట్ ఫ్లిక్స్ సంస్థకు ‘కూలీ’ దాదాపుగా రూ.125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ థియేట్రికల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ. 200 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది టాక్. అలా ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమాకు విడుదలకు ముందే, దాదాపుగా రూ.750 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. కోలీవుడ్‌లో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుగా చెపోచ్చు. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ని నాగవంశీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో విడుదల తర్వాత ‘కూలీ’ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరుతుందని బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్.