సూపర్ స్టార్ రజనీ కాంత్ కూలీ మరికొన్నిగంటల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ. వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్లకు అటు ఇటుగా అడ్వాన్స్ సేల్స్ ఉండబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోను కూలీ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. అయితే ఏపీలో కూలీ బుకింగ్స్ పలు విమర్శలకు దారి తెస్తోంది. జరుగుతున్న బుకింగ్స్ కార్పొరేట్ బుకింగ్స్ అని విమర్శలు వస్తున్నాయి.
Also Read : Tollywood Bundh : 10వ రోజుకు చేరుకున్న టాలీవుడ్ బంద్.. ఈ రోజు సమ్మె విరమణకు ఛాన్స్
అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నిన్న ఉత్తరాంధ్రలోని ఏరియాలో కూలీ అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ చేసారు. తీరా టికెట్స్ బుక్ చేసుకుందామనుకునేలోగా హౌస్ ఫుల్స్ అని చూపించడంతో కూలీ క్రేజ్ మాములుగా లేదనుకున్నారు. కానీ అదే థియేటర్ లో ఈ రోజు చూస్తే బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొందరు థియేటర్ యాజమాన్యాలు కూలీ హైప్ ని క్యాష్ చేసుకునేందుకు కార్పోరేట్ బుకింగ్స్ కు తెరలేపాయి. అయితే సన్ పిచర్స్ అన్ని చోట్ల ఇలానే కార్పోరేట్ బుకింగ్స్ తెరలేపిందా అనే అనుమానం కలుగుతోంది. టాలీవుడ్ లో ప్రతి క్రేజీ సినిమాకు థియేటర్ సీట్లను బ్లాక్ చేయడం కామన్ గా జరిగిదే కానీ బ్లాక్ చేసిన వాటిని థియేటర్స్ వద్ద బ్లాక్ టికెట్ రూపంలో సెల్ చేస్తుంటారు. కానీ కూలీకి మొదటి రోజు బ్లాక్ చేసిన టికెట్స్ ను ఓపెన్ చేయడమే వివాదానికి కారణమైంది. కూలీ భారీ బుకింగ్‌లు బాగానే ఉన్నాయ్. కానీ మరల ఇలా ఎందుకు చేసారోననే చర్చ జరుగుతుంది. ఆడియెన్స్ కి క్రేజ్ ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎందుకో మరి.