రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ప్రస్తుతానికి ఫౌజీ అని సంబోధిస్తున్నారు. హను రాఘవపుడి దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Sapthami: నితిన్ గాయం వల్ల షూటింగ్ ఆలస్యం..హార్స్ రైడింగ్ తో ఇబ్బంది!
అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రభాస్ కాలికి ఫ్రాక్చర్ జరిగిందని అంటున్నారు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. నిజానికి ప్రభాస్ కాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ కూడా గతంలో చేయించుకున్నారు. పరీక్షల కోసం ఈ మధ్య ఇటలీకి వెళ్లి కొన్నాళ్లు విశ్రాంతి కూడా తీసుకున్నారు.
Also Read:Pawan Kalyan: పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
అయితే ఇప్పుడు మరోసారి కాలికి ఫ్రాక్చర్ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆ కాలికే జరిగిందా లేక మరో కాలికి జరిగిందా అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఫ్రాక్చర్ అయినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రభాస్ షూటింగ్ జరుపుతున్నారంటే, ఆయన డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడాలంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే నిజంగానే ప్రభాస్ కాలికి ఫ్రాక్చర్ జరిగిందా లేదా అనే విషయం మీద ప్రభాస్ పీఆర్ టీమ్ ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆ వార్తలు ఫేక్ అని పేర్కొన్నారు.