సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ రోల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై క్రేజ్ పెంచేశాయి.
Also Read : Ram Pothineni : సింపుల్ పోస్ట్‌తో.. హిస్టరీ క్రియేట్ చేసిన రామ్
అయితే, ఈ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చే వార్త ఏంటంటే – విక్టరీ వెంకటేష్ ఇందులో స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. తాజా సమాచారం ప్రకారం, వెంకీ వచ్చే నెల మధ్య నుంచి సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. హైదరాబాద్‌లో జరగబోయే కొత్త షెడ్యూల్లో ఆయన ఎంట్రీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇక ఆయన పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండబోతోందనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. చిరంజీవితో కలిసి పాటలోనూ, కీలక యాక్షన్ సీక్వెన్స్‌లోనూ వెంకీ పాల్గొనవచ్చని ప్రచారం జరుగుతోంది.
దీంతో, సినిమా హైలైట్‌గా ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ కలయిక నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్, మ్యూజికల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన మాస్ – ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు భీమ్స్ సిసిరోలియో. ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పినట్టు, ‘చిరంజీవి సర్ కోసం ప్రత్యేకంగా హార్ట్ టచ్ చేసే పాత్ర రాశాం’ అన్న మాటలతో ఫ్యాన్స్‌లో బజ్ మరింత పెరిగింది. మొత్తం మీద, చిరంజీవి – వెంకటేశ్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ప్రేక్షకులకు పండుగ కానుంది. సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచనుంది.