Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధస్సు (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ పేరుతో సెలబ్రిటీల పరువు తీస్తూ, అసభ్యకరంగా వీడియోలను మార్ఫింగ్ చేస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సమరశంఖం పూరించారు. ఇటీవల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ పైశాచిక ఆనందంపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన.. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ఏకంగా కేంద్ర ప్రభుత్వం వద్దకే ఈ పంచాయితీని చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రధాన కారణం ఏ రాజకీయమో కాదు.. డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల రోజురోజుకూ దిగజారుతున్న నటీనటుల భద్రత! ఏఐ (AI) ముసుగులో జరుగుతున్న అరాచకాలను, క్రియేటివిటీ పేరుతో ఆర్టిస్టుల గౌరవాన్ని మంటగలుపుతున్న తీరును అమిత్ షాకు చిరంజీవి స్వయంగా వివరించారు. టాలీవుడ్ సహా మొత్తం సినీ పరిశ్రమ పక్షాన నిలబడి.. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని, కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు.
చరణ్ తో కలిసి వెళ్ళిన చిరంజీవి ఆవేదనను, ఆయన లేవనెత్తిన పాయింట్లను సావధానంగా విన్న అమిత్ షా.. ఈ సమస్య తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారిస్తుందని, టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలు, ఆర్టిస్టుల గౌరవానికి భంగం కలిగించే వారికి కఠిన శిక్షలు పడేలా బలమైన మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్యను మరింత వేగంగా పరిష్కరించే దిశగా.. తమకు ఒక లిఖితపూర్వక ఫిర్యాదును (రెప్రజెంటేషన్) అందజేయాలని చిరంజీవికి సూచించిన అమిత్ షా, ఈ వ్యవహారాన్ని దగ్గరుండి సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించడం, తక్షణమే ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఈ భరోసా.. భయాందోళనల్లో ఉన్న మొత్తం సినీ పరిశ్రమకు ఒక ఊరటనిస్తుందని, త్వరలోనే డీప్‌ఫేక్ నేరాలకు చెక్ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!