నందమూరి కళ్యాణ్ రామ్ హీరో నటించిన సినిమా బింబిసార నిన్న విడులైన విషయం తెలిసిందే. అయితే .. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా సైతం హిట్ కొట్టడంతో ఆ చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగింది. ఈ సినిమాలో హీరో సుమంత్ ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ రెండు సినిమాలపై సినీ ప్రముఖులు ప్రశంసలతో పాటు చిత్ర యూనిట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా.. ‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీ కి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్ని స్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ చిత్రాల నటీనటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు..’ తెలిపారు.