Site icon NTV Telugu

Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’

Chiranjeevi Anilravipudi

Chiranjeevi Anilravipudi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు.

Also Read:Dhanush: ధనుష్ తో మరో సినిమా లైన్లో పెట్టిన వెంకీ అట్లూరి?

అనిల్ రావిపూడి లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఒక రోజు ముందుగానే షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు అనిల్ రావిపూడి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన ఒక పెద్ద సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఒక ఫైట్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని సీన్స్ కూడా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కువగా టాకీ పార్ట్ పూర్తి చేయడం మీదే ఫోకస్ పెట్టాడు అనిల్ రావిపూడి.

Also Read:రుహనీ ఏంటీ కహానీ.. ఏకంగా జిప్ కిందకు లాగేశావ్?

మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో సెకండ్ షెడ్యూల్ మీద ఫోకస్ పెట్టింది టీం. సెకండ్ షెడ్యూల్ దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్‌ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వింటర్ క్యాపిటల్‌గా, అలాగే మంచి హిల్ స్టేషన్‌గా కూడా పేరు ఉంది. ఇక్కడ అనిల్ రావిపూడి ఎలాంటి సీక్వెన్స్ ప్లాన్ చేశాడో చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా కేథరిన్ త్రెసా నటిస్తుంది.

Exit mobile version