Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు.
Also Read:Dhanush: ధనుష్ తో మరో సినిమా లైన్లో పెట్టిన వెంకీ అట్లూరి?
Also Read
- Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
అనిల్ రావిపూడి లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఒక రోజు ముందుగానే షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు అనిల్ రావిపూడి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన ఒక పెద్ద సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఒక ఫైట్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని సీన్స్ కూడా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కువగా టాకీ పార్ట్ పూర్తి చేయడం మీదే ఫోకస్ పెట్టాడు అనిల్ రావిపూడి.
Also Read:రుహనీ ఏంటీ కహానీ.. ఏకంగా జిప్ కిందకు లాగేశావ్?
మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో సెకండ్ షెడ్యూల్ మీద ఫోకస్ పెట్టింది టీం. సెకండ్ షెడ్యూల్ దాదాపు 25 నుంచి 30 రోజుల పాటు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వింటర్ క్యాపిటల్‌గా, అలాగే మంచి హిల్ స్టేషన్‌గా కూడా పేరు ఉంది. ఇక్కడ అనిల్ రావిపూడి ఎలాంటి సీక్వెన్స్ ప్లాన్ చేశాడో చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా కేథరిన్ త్రెసా నటిస్తుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!