పుష్ప2తో పుష్ప రాజ్ ప్రమోషన్లలో ర్యాంపాడిస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టి మరింత జోరు చూపిస్తోంది. ఇప్పటికే హై బజ్.. హైటెన్షన్ క్రియేట్ చేసేసింది పుష్ప 2. మొదటి నుండి సౌత్, నార్త్ బెల్ట్‌లో భీభత్సమైన బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మేనియా బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పుష్ప 2 ఫీవర్ చూసి.. అదే రోజున రిలీజ్ చేద్దామనుకున్న బాలీవుడ్ మూవీ ఛావాకు ఫీవరొచ్చింది. మీరు తగ్గకపోతే మేము తగ్గిపోతాం అంటూ వెనక్కు వెళ్లిపోయింది. జనవరి 10న రిలీజ్ చేద్దాం అనుకుంటే అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుండడంతో గ్లోబల్ స్టార్‌తో మనకెందుకులే అని అక్కడ నుండి కూడా తప్పుకుంది. కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ , వీఎఫ్ ఎక్స్ ఆలస్యం సైతం ఛావాను ముందుకు నెట్టడం లేదు.
Also Read : Matka : డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్
దీంతో మరో డేట్ కోసం వెయిట్ చేస్తూ ఫైనల్లీ సినిమాకు యాప్ట్ డేట్‌ను లాక్ చేసుకుంది. క్రిస్మస్, జనవరి నుండి వాయిదా వేసుకుని ఫిబ్రవరి 14న వచ్చేందుకు రెడీ అవుతుంది. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఐదు రోజుల ముందు మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ స్టోరీ ఆధారంగా ఛావా తెరకెక్కుతోంది. ఆడియన్స్ నుండి అటెన్షన్, సినిమాపై ఇంప్రెషన్ కలిగేందుకు ఇదే టైం సరైందని ఫిక్స్ అయ్యారు మేకర్స్. విక్కీ కౌశల్ చత్రపతి శంభాజీ క్యారెక్టర్ చేస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సౌత్ ఇండియన్ సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాల దెబ్బకు ఇన్ని సార్లు వెనక్కు తగ్గిన ఛావాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ అండ్ వాచ్.